ఆడమ్ మిల్న్.. ముంబై జట్టులో చేరెనే.. విజయం దక్కుతుందా..!

డిఫెండింగ్ ఛాంపియన్ గా దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ఇప్పటి దాకా ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. మ్యాచ్ ను చివరి దాకా తీసుకొని రావడం.. ఓడిపోవడం..! ఇదీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఇక పేస్ బౌలింగ్ అటాక్ లో భాగం అయిన పాట్ కమిన్స్ దూరమవడం ముంబై ఇండియన్స్ కు పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో ఇప్పుడు ఆడమ్ మిల్న్ వచ్చి చేరాడు.

ఆడమ్ మిల్న్.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్.. టోర్నమెంట్ నుండి దూరం అయిన కమిన్స్ ప్లేస్ లో ముంబై జట్టులో చేరాడు మిల్న్..! ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయగలడు. కమిన్స్ ను మంబై 5.40కోట్లకు కొన్నది.. అతడి స్థానంలో మిల్న్ వచ్చి చేరాడు. ఇప్పటికే ఆసీస్ కు చెందిన జేసన్ బెహరెండాఫ్ స్థానంలో మిచెల్ మెక్లనేగన్ వచ్చి చేరాడు. మొదటి మ్యాచ్ లో ఆడిన మెక్లనేగన్ ను తర్వాతి మ్యాచ్ లలో తప్పించారు. ఇక మిల్న్ కు ఎటువంటి అవకాశాలు ఇస్తారో చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, ముస్తఫిజుర్ లతో ముంబై జట్టు బలంగా ఉన్నట్లు అనిపిస్తున్నా.. విజయం మాత్రం వరించడం లేదు. మిల్న్ రాకతో అయినా విజయం అందుకుంటారో లేదో ముంబై ఇండియన్స్..! టీ20ల్లో మిల్న్ ఇప్పటిదాకా 83 వికెట్లు తీశాడు.. 23.21 యావరేజ్ తో.. 7.72 ఎకానమీ నమోదు చేశాడు. ఇక ఐపీఎల్ అనుభవం అంటే ఆర్సీబీకి గత రెండు సీజన్ల పాటూ ఆడాడు మిల్న్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here