యువ‌కుల గుండెల‌పై ఎస్సీ, ఎస్టీ అనే ముద్ర‌!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అనాగ‌రిక ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. శారీర‌క దృఢ‌త్వ ప‌రీక్ష‌ల్లో పాల్గొన్న అభ్య‌ర్థుల ఛాతీపై వారి కులం ఏమిటో రాశారు అక్క‌డి డాక్ట‌ర్లు. ఎస్సీ, ఎస్టీ అని ముద్ర వేసి పంపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోమ్‌శాఖ‌లో కానిస్టేబుల్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నిర్వ‌హించిన వైద్య‌, శారీర‌క ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా డాక్ట‌ర్లు ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు.

శారీర‌క దృఢ‌త్వ ప‌రీక్ష‌లను నిర్వ‌హించిన అనంత‌రం.. వారు ఆ యువ‌కుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాశారు. ఎస్సీ కేట‌గిరీ, ఎస్టీ కేట‌గిరీల కింద వారిని ప‌రీక్షించిన‌ట్లు నిర్ధారిస్తూ డాక్ట‌ర్లు స‌ర్టిఫికెట్‌ను కూడా జారీ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. డాక్ట‌ర్ల ఈ అనాలోచిత చ‌ర్య‌పై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.

దీనికి వివ‌ర‌ణ ఇచ్చుకునే ప‌నిలో ప‌డ్డారు ఆ రాష్ట్ర హోమ్‌శాఖ అధికారులు. ఇదివ‌ర‌కు మ‌హిళా కానిస్టేబుళ్ల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన శారీర‌క ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా ఒక‌రి కులాన్ని ఇంకొక‌రికి రాశార‌ని, దీన్ని నివారించ‌డానికి డాక్ట‌ర్లు ఆయా కేట‌గిరీల‌కు చెందిన యువ‌కుల గుండెల‌పై వాటిని రాశార‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here