`మీరంతా భార‌తీయ కుక్క‌లు..`: సింగ‌ర్ అద్నాన్ స‌మీ, అత‌ని టీమ్‌కు కువైట్‌లో ఘోర అవ‌మానం

న్యూఢిల్లీ: తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో పాట‌లు పాడిన పాకిస్తానీ గాయ‌కుడు, భార‌తీయ పౌర‌స‌త్వాన్ని పొందిన‌ అద్నాన్‌స‌మీ, అత‌ని టీమ్‌కు కువైట్‌లో ఘోర అవ‌మానం ఎదురైంది. విమానాశ్ర‌యంలో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు.. వారిని `భార‌తీయ కుక్క‌లు`గా అభివ‌ర్ణించారు. ఈ విష‌యాన్ని స‌మీ.. త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

కువైట్‌లో స్థిర‌ప‌డిన ప్ర‌వాస భార‌తీయులు ఆదివారం అద్నాన్‌స‌మీతో ఓ మ్యూజిక‌ల్ నైట్ షోను ఏర్పాటు చేశారు. ఇందులో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి స‌మీ, అత‌ని టీమ్ కువైట్‌కు వెళ్లింది. విమానాశ్ర‌యంలో దిగిన త‌రువాత అక్క‌డి ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వారి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దౌర్జ‌న్యం చేశారు. `ఇండియ‌న్ డాగ్స్‌..` అంటూ తిట్టారు.

తాను ఎన్నో ఆశ‌ల‌తో కువైట్‌లో అడుగు పెట్టాన‌ని, భార‌తీయ సాంస్కృతిక సువాస‌న‌ల‌ను మోసుకొచ్చాన‌ని, అక్క‌డి అధికారులు మాత్రం త‌మ‌ను ఘోరంగా అవ‌మానించార‌ని స‌మీ ట్వీట్ చేశారు. త‌మ‌ను ఆద‌రించ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని, ఇండియ‌న్ డాగ్స్ అంటూ తిట్ట‌డం క‌లిచి వేసింద‌ని అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అక్క‌డి అధికారుల‌తో మాట్లాడుతార‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here