ఇన్ని తిని కూడా ప్రాణాల‌తో ఎలా ఉన్నాడంటూ బిత్త‌ర‌పోయిన డాక్ట‌ర్లు!

ల‌క్నో: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఓ విచిత్ర‌మైన ఘ‌ట‌న వెలుగు చూసింది. ముదురు బ్యాచిల‌ర్ అయినా పెళ్లి కావ‌ట్లేదు.. ఏదైనా మార్గం చూపించండంటూ ఓ మంత్ర‌గాడిని ఆశ్ర‌యించాడో వ్య‌క్తి. ఏ తాయెత్తో, నిమ్మ‌కాయో ఇచ్చి వెన‌క్కి పంప‌లేదా మాంత్రికుడు. ఓ వెరైటీ స‌ల‌హా ఇచ్చాడు. అది కాస్తా ఆ వ్యక్తి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది.

 

ఇంత‌కీ ఆ మంత్ర‌గాడు ఇచ్చిన స‌ల‌హా ఏమిటంటే.. ఇనుప ముక్క‌లు, బ్యాట‌రీలు, విద్యుత్ వైర్లు, గాజు పెంకులు తినాల‌ని సూచించాడు. అవి తింటే స‌మ‌స్య‌లేవీ ఉండ‌వ‌ని చెప్పాడు. ఆ అమాయ‌కుడు నిజంగానే ఆ మంత్ర‌గాడు చెప్పిన‌ట్టు చేశాడు. క‌డుపు ఇనుప ముక్క‌ల కార్ఖానాగా త‌యారైంది. క‌డుపు నొప్పి త‌ట్టుకోలేక ఆసుప‌త్రికి వెళ్ల‌గా.. అస‌లు విష‌యం వెలుగు చూసింది.

ఎక్స్‌రే తీసి చూసిన డాక్ట‌ర్లు కూడా బిత్త‌ర‌పోయారు. ఇన్ని తిని కూడా ప్రాణాల‌తో ఎలా ఉన్నాడోనంటూ త‌ల బ‌రుక్కున్నారు డాక్ట‌ర్లు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని హ‌ర్దోయిలో చోటు చేసుకుంది. ఆ వ్య‌క్తి అజ‌య్ ద్వివేది. వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. ఇంత వ‌య‌స్సొచ్చిన‌ప్ప‌టికీ.. పెళ్లి కాక‌పోవ‌డంతో మంత్ర‌గాడిని ఆశ్ర‌యించి.. ఇలా ఏది ప‌డితే అది మింగి.. ఆసుప‌త్రి పాల‌య్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here