ఆఫ్రికా ఖండం రూపురేఖ‌ల‌నే మార్చ‌బోతున్న మ‌హా చీలిక‌!

నైరోబి: ఇప్పుడు మీరు చూస్తోన్న ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న చీలిక ఓ ఖండం రూపు రేఖ‌ల‌నే స‌మూలంగా మార్చ‌బోతోంది. ఈ మ‌హా చీలిక.. ఏ భూకంపం వ‌ల్లో, ఏ ప్ర‌కృతి వైప‌రీత్యం వ‌ల్లో ఏర్ప‌డింది కాదు. స‌హ‌జ సిద్ధంగా, భూమి పొర‌ల్లో ఏర్ప‌డిన ప్ర‌క్రియ వ‌ల్ల ఈ మ‌హాచీలిక ఏర్ప‌డింది.

ఈ ఓ ఖండాన్ని సైతం రెండుగా చీల్చబోతోంద‌ని భూగ‌ర్భ శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ఆఫ్రికా దేశం కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని ఓ జాతీయ ర‌హ‌దారిని చీల్చుకుంటూ ఈ ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. టెక్టోనిక్‌ ప్లేట్లలో ప‌గుళ్లు సంభ‌వించ‌డం వ‌ల్లే ఈ చీలిక ఏర్ప‌డింద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ఆఫ్రికా ఖండం చీలిపోవ‌డానికి ఇది కార‌ణ‌మౌతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కెన్యా నైరుతీ ప్రాంతం గుండా ఈ జాతీయ ర‌హ‌దారి సాగుతుంది. అక్క‌డున్న రిఫ్ట్‌ వ్యాలీ వద్ద ఈ చీలిక‌ ఏర్పడింది. కిలోమీట‌రో, రెండు కిలోమీట‌ర్లో కాదు.. కొన్ని మైళ్ల పొడ‌వు ఉందీ చీలిక‌, కొండ‌లు, లోయ‌ల గుండా సాగింది. రాజ‌ధాని నైరోబిని అనుసంధానించే జాతీయ ర‌హ‌దారితో పాటు చాలా వ‌ర‌కు ఇళ్లు కూడా సగానికి చీలిపోయాయి దీని దెబ్బ‌కు.

ఇప్పటికిప్పుడు కాక‌పోయిన‌ప్ప‌టికీ.. ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోతుంద‌డానికి దీన్ని నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆఫ్రికా ఖండంలో క‌లిసి ఉన్న సొమాలియా, కెన్యా, ఇథియోపియా దేశాలు ఈ చీలిపోయిన ఖండంలో ద్వీప దేశాలుగా మిగులుతాయ‌ని చెబుతున్నారు.

కెన్యాలోని న‌రోక్ కంట్రీ, నైరోబి స‌రిహ‌ద్దులో ఏర్ప‌డిన ఈ చీలిక వెడ‌ల్పు 50 అడుగులు, లోతు 60 అడుగులు. హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా గుర్తింపు పొందిన మొజాంబిక్ నుంచి గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ వ‌ర‌కు ఈ చీలిక ఏర్ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here