పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అద్భుతమైన క్యాచ్ అందుకున్న షాహిద్ అఫ్రీది..!

పాకిస్థాన్ సూపర్ లీగ్.. పాకిస్థాన్ బోర్డు మొదలుపెట్టిన టీ20 లీగ్.. రెండు రోజుల క్రితమే మూడో సీజన్ అట్టహాసంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన టీ20 స్టార్లు ఈ సిరీస్ లో ఆడుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన షాహిద్ అఫ్రీది లాంటి ఆటగాళ్ళు కూడా ఈ లీగ్ లో పాలుపంచుకుంటున్నారు. ఈ ఏడాది అఫ్రీది కరాచీ కింగ్స్ కు ఆడుతున్నాడు.

మొదట బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 149 పరుగులు చేసింది. చేజింగ్ కు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ లక్ష్యాన్ని అందుకోలేక 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వెట్టా ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో షాహిద్ అఫ్రీది ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అఫ్రీది వయసుతో పోల్చుకుంటే ఇది చాలా మంచి క్యాచ్ అని క్రికెట్ అభిమానులు అంటూ ఉన్నారు.

ఉమర్ అమిన్ బ్యాటింగ్ ఆడుతుండగా ఓ మంచి షాట్ కొట్టాడు. అది దాదాపు సిక్సరే అని అనుకున్నారు. కానీ అఫ్రీది దాన్ని అద్భుతంగా అందుకున్నాడు.. ఇంతలో బౌండరీ లైన్ ను దాటుతున్నానని అనుకున్న అఫ్రీది దాన్ని గాల్లోకి విసిరేసి.. మళ్ళీ లోపలికి వచ్చి క్యాచ్ ను అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్ అభిమానులంతా ఫిదా అయిపోయారు. లాలాకు వయసు ఓ నంబర్ మాత్రమేనని అభిమానులు సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here