అప్పుడు చాయ్ వాలా.. ఇప్పుడు ‘కర్భూజా వాలా’ అట.. కొందరి ఓవరాక్షన్..!

పాకిస్థాన్ చాయ్ వాలా గుర్తున్నాడు కదూ.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషనల్ అయిపోయాడు. ఆ తర్వాత అతడికి వరుసగా మోడలింగ్ ఛాన్స్ లు.. టీవీ షోలతో స్టార్ అయిపోయాడు. అందుకే సోషల్ మీడియా వచ్చాక.. ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అయిపోతారో అసలు ఊహించలేము. ఆ తర్వాత కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది గురించి పలు వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరో సోషల్ మీడియా స్టార్ బయటకు వచ్చాడు. అది కూడా పాకిస్థాన్ కు చెందిన వాడే.. ఇతడు చేసే పని కర్భూజా ఫలాలను అమ్మడం. అతడి ఫోటోలు చూసి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. అతడి గుడ్ లుక్స్ ను చూసిన ఎవరైనా కానీ ఇక కర్భూజాలు అమ్మింది చాలు.. మోడలింగ్ నేర్చుకో అని పిలుపును ఇచ్చే వాళ్ళే..! ఇంత ఓవరాక్షన్ చేస్తున్న వాళ్లకు చెప్పేది ఏమిటంటే అతడేమీ పుచ్చకాయలను అమ్మేవాడు కాదట.. కాబోయే డాక్టర్..!

అతడి పేరు మొహమ్మద్ అవైస్.. కరాచీ లోని జియాఉద్దీన్ మెడికల్ కాలేజీలో చదువుతూ ఉన్నాడు. అతడు ఏదో పుచ్చకాయలను కోస్తూ ఫోటో తీసుకోవడంతో అతడు ఓ పుచ్చకాయలు అమ్మేవాడని.. అతన్ని కూడా మోడలింగ్ లోకి తీసుకోమంటూ సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేస్తున్న వాళ్ళు చాలా మందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here