మ‌క్కా మ‌సీదు ఘ‌ట‌న‌ త‌రువాత జంట పేలుళ్ల‌తో వ‌ణికిన జంట‌న‌గ‌రాలు!

హైద‌రాబాద్: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన పాత‌బ‌స్తీ మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసు మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం తుది తీర్పును వెలువ‌డించింది. ఈ కేసులో ఇప్ప‌టిదాకా అరెస్ట‌యిన వారిపై న‌మోదైన కేసుల‌ను ప్ర‌త్యేక న్యాయ‌స్థానం కొట్టివేసింది.

ఈ పేలుళ్ల ఘ‌ట‌న త‌రువాత చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు హైద‌రాబాద్‌ను వ‌ణికించాయి. 2007 మే 18వ తేదీన మ‌క్కా మ‌సీదులో పేలుళ్లు సంభ‌వించ‌గా.. స‌రిగ్గా మూడు నెల‌ల త‌రువాత అంటే అదే ఏడాది ఆగ‌స్టు 25వ తేదీన జంట‌న‌గ‌రాల్లో జంట పేలుళ్లు సంభ‌వించాయి.

లుంబిని పార్క్‌, గోకుల్ ఛాట్ భండార్‌ల‌ల్లో సంభ‌వించిన పేలుళ్లు జంట‌న‌గ‌రాలవాసుల‌కు పీడ‌క‌ల‌ను మిగిల్చాయి. ఇప్ప‌టికీ ఆ చేదు జ్ఞాప‌కాల నుంచి తేరుకోని వారు చాలామందే ఉన్నారు.

సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో ప‌ది నిమిషాల వ్య‌వ‌ధిలో ట్యాంక్‌బండ్ స‌మీపంలోని లుంబిని పార్క్ లేజ‌ర్ షో, కోఠిలోని గోకుల్ ఛాట్ భండార్‌ల‌ల్లో పేలుళ్లు సంభ‌వించాయి. మ‌క్కా మ‌సీదు త‌ర‌హాలోనే పేలుళ్ల కోసం ఐఈడీని ఉప‌యోగించారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో 42 మంది అమాయ‌కులు బ‌ల‌య్యారు.

 

58 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిలో కొంద‌రు ఇప్ప‌టికీ తేరుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. నిషేధిత హ‌ర్క‌తుల్ జిహాది ఇస్లామీ ఈ పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ నిర్ధారించింది. బంగ్లాదేశ్ నుంచి ఈ పేలుళ్ల‌ను ఆప‌రేట్ చేసిన‌ట్టు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here