వేలంపాటలో పాల్గొన్న ప్రీతీ జింటా గురించి పక్కనే ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ ఏమని ట్వీట్ చేశాడంటే..!

బెంగళూరులో ఐపీఎల్ వేలంపాట జరుగుతున్న సంగతి తెలిసిందే..! కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున కొ ఓనర్ అయిన ప్రీతీ జింటా పాల్గొంటోంది. ఆమె పక్కనే ఆ జట్టు మెంటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. అయితే పక్కనే ప్రీతీ జింటాను పెట్టుకొని వీరేంద్రుడు ఓ ట్వీట్ ను పేల్చాడు.

కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున పెద్ద పెద్ద స్టార్స్ ను సొంతం చేసుకున్నారు. ఆరోన్ ఫించ్, మిల్లర్, కె.ఎల్.రాహుల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, అశ్విన్ లను కొనేసింది. అలాగే ప్రతి ఒక్కరినీ కొనాలని ప్రీతీ తెగ తాపత్రయపడింది. మనీష్ పాండే, బెన్ స్టోక్స్ ను కొనాలని తెగ ప్రయత్నించింది కానీ కుదరలేదు. ప్రీతీని చూసిన వాళ్ళు అందరినీ కొనేస్తుందా అని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.

అయితే వీరేంద్రుడు పెట్టిన ట్వీట్ మాత్రం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది..

అదేమిటంటే.. “అమ్మాయిలకు షాపింగ్ చేయాలంటే తెగ ఇష్టం.. ప్రీతీ అయితే ఈరోజు ఫుల్ షాపింగ్ మూడ్ లో ఉంది.. ప్రతి ఒక్కరినీ కొనేయాలని అనుకుంటోంది” అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుండి తెగ రెస్పాన్స్ వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here