మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. మీడియా ముందుకు వచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు..!

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం చాలా అరుదు. అలాంటిది ఒకటేసారి నలుగురు న్యాయమూర్తులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంలో రెండో సీనియర్ జడ్జిగా కొనసాగుతోన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ మీడియా సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్‌తోపాటు జస్టిస్ లోకుర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా సుప్రీం కోర్టులో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తిని కోరినా ఫలితం లేదన్నారు. సుప్రీం అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేదని జాస్తి చలమేశ్వర్ తెలిపారు. ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తిని కోరినప్పటికీ ఆయన సరైన నిర్ణయం తీసుకోలేదని చలమేశ్వర్ తెలిపారు.

రెండు నెలల క్రితం చీఫ్ జస్టిస్ మిశ్రాకు తాము రాసిన లేఖలను కూడా బయటపెట్టారు. హై కోర్టులలోనూ, సుప్రీంకోర్టులోనూ జడ్జిలను నియమించాలని చెప్పినా వారు పట్టించుకోలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here