సిగరెట్టు పొగ కంటే అగర్బత్తీ పొగ చాలా ప్రమాదమట.. నిజాలు తెలుసుకున్నాక..!

సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ విభాగం చేసిన పరిశోధనలో ఓ భయంకరమైన నిజం బయటపడింది. మనం ఎప్పుడూ ఉపయోగించే అగర్బత్తీలు మన ప్రాణాలకే ముప్పు అని తేల్చారు. ఎంతగా అంటే సిగరెట్ పొగ వల్ల కలిగే హాని కంట అగర్ బత్తీ పొగ మన శరీరానికి ఎంతో హాని చేస్తుందట. అగర్‌బత్తీల తయారీలో సువాసన కోసం ఉపయోగించే కృత్రిమమైన పరిమళాలు, ఇతర పదార్థాలు పొగ ద్వారా మానవ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఆ పొగలో ఉండే 64 రకాల విష పదార్థాలు శ్వాస కోశ సంబంధమైన వ్యాధులకు గురి చేస్తాయని తాజా పరిశోధనల్లో తేలింది.

అగర్ బత్తీల నుంచి వచ్చే పొగలో నుంచి వెలువడే అతి చిన్న పరిమాణంలో ఉండే అణువులు గాలిలో కలిసిపోతాయి. ఆ పొగ నుంచి వచ్చే అణువుల్లో ఉన్న విషపూరితమైన పరమాణువులు శరీరంలోని వెళ్ళి క్యాన్సర్‌కు కారణం అవుతాయి. ముక్కు ద్వారా లోనికి ప్రవేశించి చివరికి డీఎన్ఏ మీద ప్రభావం చూపెడతాయి. ఈ కెమికల్స్ వలన శరీరంలో మొదట ఇరిటేషన్ అన్నది ప్రారంభం అవుతుంది.. ఆ తర్వాత కేన్సర్ లాంటి మహమ్మారికి కారణమవ్వచ్చు.

అగర్‌బత్తీ ద్వారా వచ్చే పొగలో మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అనే మూడు రకాల విష పదార్థాలు మన శరీరాన్ని రకరకాల వ్యాధులకు గురి చేస్తాయి. వీటి వల్ల క్యాన్సర్ కణాల అభివృద్ధి ప్రారంభం అవడంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం ఎంతగా ఉంటుందంటే మనిషి డీఎన్‌ఏలో కూడా మార్పులు వచ్చేస్తాయి.

మ్యూటాజెనిక్ కెమికల్ మొదట రక్తంలోకి చొరబడుతుంది.. ఆ తర్వాత డీఎన్ఏ పై ప్రభావం చూపెడుతుంది. ఇక జెనోటాక్సిక్ శరీరం క్యాన్సర్ కారనమయ్యేలా చేస్తుంది. సైటోటాక్సిక్ అయితే శరీరంలోని కణాలకు తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంది. అగర్బత్తీల నుండి ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. చిన్న పిల్లల ఊపిరితిత్తులపై ఈ పొగ తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here