స్విగ్గీ, జొమాటోల నుండి భోజనం ఆర్డర్ ఇవ్వాలట.. సీబీఐ అధికారులతో కార్తీ పరాచికాలు..!

కార్తీ చిదంబరం.. మనీలాండరింగ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నాడు. అయితే చిదంబరం చేస్తున్న చేష్టలు సీబీఐ అధికారులకు చిర్రెత్తుకొస్తోంది. గొంతెమ్మ కోర్కెలను కోరుతూ వారికి విసుగుతెప్పిస్తున్నాడు. మాటకు మాటకు సమాధానం చెబుతూ వారిని ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నాడట. తనకు ఇంటి భోజనం కావాలని కోర్టుకు కార్తీ విన్నవించగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో కనీసం, స్విగ్గీ లేదంటే జొమాటో నుంచైనా ఆహారం తెప్పించేలా అధికారులకు సూచించాలని సీబీఐని కార్తీ కోరాడంటే ఏ రేంజిలో పరాచికాలు ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

గురువారం కార్తీ చిదంబరాన్ని ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ వద్ద స్విగ్గీ, జొమాటోలు లేవని సీబీఐ అధికారులు చెప్పడంతో తొందరగా డౌన్‌లోడ్ చేసుకుని ఆర్డర్ ఇవ్వండి అంటూ వెటకారం ఆడాడు. తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తొలగించేందుకు కార్తీ ఒప్పుకోలేదు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో తన స్నేహితుడితో కార్తీ తమిళంలో మాట్లాడగా.. ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలంటూ సీబీఐ అధికారులు చెప్పడంతో‘అలా అయితే మీరు కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడండి. అప్పుడు నేను కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడతా’ అని జవాబిచ్చాడు. మొత్తానికి అంతా చూస్తుంటే కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నట్లు లేదు.. సీబీఐ అధికారులే కార్తీ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్‌ఐపీబీ) నుంచి అనుమతులు ఇప్పించడం కోసం లంచం తీసుకున్నారన్న ఆరోపణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధవారం సీబీఐ అరెస్టు చేసింది. కార్తీని 5 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గురువారం ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here