అన్న రికార్డును బద్దలు కొట్టిన తమ్ముడు.. అజ్ఞాతవాసి మొదటిరోజు కలెక్షన్లు..!

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. జనవరి 10న ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలు పడగా.. తెలంగాణలో మార్నింగ్ షోలతో సందడి చేసింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం పలువురిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి.

ఏరియాల వారీగా చూసుకుంటే, నైజామ్ లో 5.45 కోట్లు .. సీడెడ్ లో 3.35 కోట్లు .. నెల్లూరులో 1.64 కోట్లు .. గుంటూరులో 3.78 కోట్లు .. కృష్ణాలో 1.83 కోట్లు .. వెస్ట్ 3.70 కోట్లు .. ఈస్ట్ 2.85 కోట్లు .. ఉత్తరాంధ్ర 4.30 కోట్లు .. ఇలా ఈ సినిమా తొలిరోజున 26.93 కోట్లను రాబట్టింది. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తొలి రోజున 23.30 కోట్లను వసూలు చేసి, ‘బాహుబలి 2’ తరువాత స్థానంలో నిలబడింది. తాజాగా అన్న రికార్డును తమ్ముడు తిరగరాయడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా 55కోట్ల వసూళ్ళు సాధించినట్లు ట్రేడ్ అనలిస్ట్ ఉమైర్ సంధు తెలిపారు.

https://twitter.com/sandhumerry/status/951145411842101248

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here