అజ్ఞాతవాసి మొదటి వారం రోజుల కలెక్షన్లు ఇవే.. ఇప్పటి నుండే అసలు పరీక్ష..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి వారం రోజులూ పండుగ సీజన్ కావడంతో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. స్పెషల్ షోలు.. అధిక షోలతో భారీ ఓపెనింగ్ ను సంపాదించుకుంది. ఇప్పటిదాకా సెలవుల్లో ఏదో ఒక సినిమా చూద్దాం అని అనుకున్న వాళ్ళు అజ్ఞాతవాసిని చూసి వచ్చారు. సినిమా లాభాల బాట పట్టాలంటే ఇప్పుడు కూడా బాగా కలెక్షన్లు రావాలి.

 

తొలివారంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 39.15 కోట్ల షేర్ ను .. 59.7కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే .. 54.95 కోట్ల షేర్ ను .. 88.7 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అదనపు షోలు, టికెట్ రేటు ఎక్కువగా ఉండటం వలన ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు సాధించడం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకుంది.

గ్రాస్                                        షేర్

(కోట్లలో)                                       (కోట్లలో)

వైజాగ్     5.21

ఈస్ట్        3.82

వెస్ట్        4.47

కృష్ణా      3.08

గుంటూర్ 5.01

నెల్లూరు  2.16

ఆంధ్ర      23.75                             35.1

సీడెడ్      5.10                                7.5

నైజాం       10.30                              17.1

తెలుగు రాష్ట్రాలు 39.15                    59.7

(మొత్తం)

యుఎస్ 7.10                                  12.9

కర్ణాటక 6.25                                    10.5

మిగిలిన చోట్లు 2.45                           5.6

ప్రపంచవ్యాప్తంగా 54.95                    88.7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here