అజ్ఞాతవాసిపై ట్వీట్ చేసిన కత్తి మహేష్.. ఏమని రివ్యూ ఇచ్చాడంటే..!

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ విధానాల మీద, అభిమానుల మీద ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పలు కామెంట్లు చేస్తూ వచ్చారు. అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందే ‘లార్గోవించ్’ అనే సినిమా కాపీ ఇదని చెప్పేశారు. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు రివ్యూ ఇద్దామా అని కూడా కత్తి మహేష్ ఎదురుచూశారు. తాను సినిమాకు వెళుతున్నానని.. అజ్ఞాతవాసి సినిమా రివ్యూ కూడా ఇస్తానని చెప్పారు.

అనుకున్నట్లుగానే కత్తి మహేష్ అజ్ఞాతవాసి సినిమా గురించి ట్వీట్ వేశారు. సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మషేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ విమర్శించారు. ‘రిస్క్ చేసి చూస్తే… టైమేమో…’ (ఈ సినిమాలో బైటికొచ్చి చూస్తే టైమేమో పాట ట్యూన్ లా అంటూ) కామెంట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here