నిరాహార దీక్ష మధ్యలో లంచ్ బ్రేక్.. బిరియానీ.. మందు కూడా..!

ఈ కాలంలో రాజకీయ నాయకుల మంచితనం గురించి.. వారి నిజాయితీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా తమిళనాడులో నిరాహార దీక్ష కాస్తా పార్టీ అయిపోయింది. అదేదో అందరూ కలిసి పార్టీ చేసుకున్నట్లు అన్నట్టు ఉంది నిరాహారదీక్ష శిబిరం. కావేరీ జలాల కోసం చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏఐఏడిఎంకే పార్టీ కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని పోరాడుతోంది. అది కూడా అధికార పార్టీ అయుండి. ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్ సెల్వంలు కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇదంతా ముందు వైపు జరుగుతున్న వ్యవహారం. ఇక వెనుక అంటారా ఏకంగా చిన్నసైజు పార్టీనే జరుగుతోంది. నిరాహార దీక్ష చేస్తున్న వారు ఫుల్ గా భోజనం చేస్తున్నారు. వెజ్ కావాల్సిన వాళ్ళు వెజ్ ఐటమ్స్.. నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళు చికెన్ బిరియాని.. ఫుల్ గా లాగిస్తూ ఉన్నారు. దీనికి తోడు మద్యం కూడా సరఫారా చేసినట్లు ఉన్నారు నాయకులు.. దాని పట్టు కూడా పడుతున్నారు. ఇదంతా కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీక్ష కాస్తా పార్టీని చేసేశారుగా అని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here