హోలీ రోజు భంగ్ తాగాడు.. కేవలం లుంగీ మాత్రమే ధరించి అమ్మాయిల హాస్టల్ లో దూరాడు..!

హోలీ సందర్భంగా భంగ్ అనే డ్రింక్ ఎక్కువగా తాగుతారు.. ఆ రోజు స్పెషల్ అదే అని అంటూ ఉంటారు. తాగితే మత్తు కూడా ఎక్కుతుంది. అలా హోలీ వేడుకల్లో భాగంగా ఓ విద్యార్థి భంగ్ బాగా తాగాడు. అది కూడా ఢిల్లీలోని ఎయిమ్స్ లో.. తాగినవాడు తూగుతూ తూలుతూ చివరికి లేడీస్ హాస్టల్ లోకి వెళ్ళాడు.. అమ్మయిలంతా అతన్ని చూసి బయటకు పరిగెత్తుకొని వచ్చేశారు. ఈ విషయం ఇప్పుడు కాలేజీ పరువును మంటగలిపింది.

ప్రతిష్ఠాత్మక వైద్య విద్యాలయం పట్నా ఎయిమ్స్ లో నిర్వహించిన హోలీ పార్టీలో కేరళ నుంచి వచ్చి వైద్య విద్యను అభ్యసిస్తున్న యువకుడు కూడా పాల్గొన్నాడు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి, కేవలం లుంగీ మాత్రమే ధరించి లేడీస్ హాస్టల్ లోకి వెళ్ళాడు. అతను అక్కడున్న సమయంలో పలుమార్లు లుంగీ జారిపోయింది. ఆపై హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతన్ని బయటకు గెంటేశారు.

విషయం తెలుసుకున్న కాలేజ్ మేనేజ్ మెంట్ అతన్ని కాలేజీ నుంచి పంపించి వేసింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విద్యార్థినులు సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, డీబార్ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఘటన గత వారంలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోలీ పార్టీలో పలు మాదకద్రవ్యాలు అక్కడి విద్యార్థులు తీసుకోవడం జరిగింది. కానీ చాలా మంది అసలు విషయాన్ని బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ అమ్మాయిల నిరసనతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here