సౌదీ మీదుగా భారత్ కు చెందిన విమానం అక్కడకు వెళ్ళడం చరిత్రలో ఇదే తొలిసారి..!

ఇప్పటి వరకూ ఏ దేశానికీ ఇవ్వని అవకాశం సౌదీ అరేబియా భారత్ కు ఇచ్చింది. ఏ దేశ విమానం కూడా సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వెళ్ళిన చరిత్ర లేదు.. కానీ భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా విమానం మొదటి సారి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. భారత విమానయాన సంస్థ ఎయిరిండియా మొదటిసారిగా సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌కు చేరుకుంది.

గతంలో జరిగిన కొన్ని కారణాల వలన అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించలేదు.. అందుకోసమే ఏ దేశానికి చెందిన విమానం కూడా సౌదీ మీద ఎగురుతూ ఇజ్రాయెల్ కు వెళ్ళలేదు. అయితే సౌదీతో మనకున్న స్నేహ బంధాల ముందు ఆ నిబంధనలు కూడా నిలబడలేకపోయాయి. సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఎయిరిండియా విమానం ఇజ్రాయెల్‌ చేరుకుంది. ఈ సరికొత్త రూట్ ద్వారా దాదాపు రెండు గంటల పాటూ ప్రయాణ సమయం తగ్గిపోయింది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు సౌదీ అరేబియా మీదుగా తొలిసారి విమానం వచ్చిన సందర్భంగా ఇజ్రాయెల్‌ పర్యాటక మంత్రి యారివ్‌ లెవిన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత్ కు దన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here