సౌదీ అరేబియా హోట‌ల్‌లో ఎయిరిండియా పైలెట్ అనుమానాస్ప‌దంగా..!

విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా.. సౌదీ అరేబియాకు వెళ్లిన ఎయిరిండియా పైలెట్ ఒక‌రు హోట‌ల్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. సౌదీ అరేబియా రాజ‌ధాని రియాధ్‌లోని హోట‌ల్ హాలిడే ఇన్‌లోని జిమ్‌లో అత‌ని మృత‌దేహం క‌నిపించింది. అత‌ణ్ని రిత్విక్ తివారీగా గుర్తించారు.

27 సంవ‌త్స‌రాల రిత్విక్ ఎలా మ‌ర‌ణించాడ‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. గుండెపోటు కార‌ణ‌మై ఉండొచ్చిని అనుమానిస్తున్నారు. ఎయిరిండియా విమానం పైలెట్‌గా సౌదీ అరేబియాకు వెళ్లిన రిత్విక్ తివారీ.. రాజ‌ధాని రియాధ్‌లోని ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు.

హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన జిమ్ సెంట‌ర్‌లో రిత్విక్ తివారీ మృత‌దేహం క‌నిపించింది. మొద‌ట‌గా దీన్ని కోపైలెట్ రేణు మౌలే గుర్తించారు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు రిత్విక్ తివారీ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here