ఎయిర్ టెల్ వినియోగదారులారా.. 30జీబీ డేటా ఫ్రీగా వాడేసుకోండి..!

కొద్ది రోజుల క్రితం జియో తమ వినియోగదారులకు 10 జీబీ ఉచిత డేటా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఎయిర్ టెల్ చేరింది. తమ వినియోగదారులకు 30జీబీ డేటా ఫ్రీగా వాడేసుకోండి అని ఆఫర్ ఇచ్చింది.. అది కూడా హై స్పీడ్ 4జి వోల్ట్ సర్వీస్. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, పంజాబ్ సర్కిళ్లలో ఎయిర్ టెల్ వోల్ట్ బీటా కార్యక్రమం అందుబాటులో ఉంది. ఉచిత డేటా ప్యాకేజీలో భాగంగా యూజర్లు 30జీబీ వరకు వాడేసుకోవచ్చు.


మొదట 10జీబీ డౌన్ లోడింగ్ కు తొలుత అవకాశం ఇస్తుంది. నాలుగు వారాల వినియోగం తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. అనంతరం మరో 10జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత మరో నాలుగు వారాలు గడిచిన అనంతరం చివరగా ఇంకో 10 జీబీ డేటా ఇస్తుంది. నెట్ వర్క్ పరంగా ఎదుర్కొనే సమస్యలపై యూజర్లు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళ డేటాను వాడి అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది చెప్పాలి మనం.. అంతే..! ‘ఉచితంగా డేటా వినియోగించుకోండి… మా టెక్నాలజీ ఎలా ఉందో పరీక్షించి అభిప్రాయాలు చెప్పండి’ అంటూ కొత్త ఆఫర్ ను ఇస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here