విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్?

చియాన్ విక్రమ్ హీరోగా గతంలో చేసిన సామి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో బాలయ్య లక్ష్మి నరసింహ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు సామి సినిమాను తమిళ తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నాడు విక్రమ్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సినిమా పై మంచి హైప్ తెచ్చేలా చేసింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మొదటి భాగంలో నటించిన త్రిష ను తీసుకుందామని అనుకున్నారు .. కానీ ఆమె ప్లేస్ ని కొట్టేసింది కుర్ర హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు పెట్టేస్తూ బిజీగా మారిన ఈ అమ్మడు త్రిష ఛాన్స్ కొట్టేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here