అఖిల్ కు బాధతో అక్కినేని అభిమానులు రాసిన లేఖ..!

అక్కినేని అఖిల్ ఇటీవలే హలో సినిమా ద్వారా మంచి హిట్ ను అందుకున్నాడు. యాక్టర్ గానూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇదంతా ఒకలా ఉంటే మరోవైపు అక్కినేని అభిమానులు తమ బాధను వెళ్ళగక్కుతూ ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేమిటంటే.. అక్కినేని కుటుంబం వద్ద పని చేస్తున్న వారు ప్రవర్తించిన తీరు వలన..! 28-12-2017న విడుదల చేసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కినేని కుటుంబానికి చెడ్డపేరు తీసుకొని వస్తున్న పనివాళ్ళ గురించి మీరైనా పట్టించుకోవాలని అఖిల్ కు లేఖ రాశారు.

ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉండే అక్కినేని అభిమానులు ఇప్పుడు వేలల్లో ఉన్నారు. దీనికంతటికి కారణం అక్కినేని హీరోల దగ్గర పనిచేసే వర్కర్స్ అంటూ పేర్కొన్నారు. అభిమానులు తమ అభిప్రాయాలను మీతో పంచుకోవడానిక వస్తే మీ దగ్గర పనిచేసే వర్కర్స్ అవకాశం ఇవ్వలేదని, ఆడియో ఫంక్షన్‌లలోనూ వారి తీరు చాలా బాధాకరంగా ఉందని ఆ లేఖలో వారిపోయారు.

ఇక అఖిల్ తన మూడో సినిమా గురించి ఈ నెల 10న అఫీషియల్ గా ప్రకటించనున్నాడు. ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య పినిశెట్టి చెప్పిన కథకు అఖిల్ ఆసక్తికనబరుస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మలుపు చిత్రం ద్వారా సత్య సక్సెస్ ను అందుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here