కనీసం ఊహించని అక్కినేని కుటుంబం..!

అక్కినేని కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆదాయపు వివరాలు ఇవ్వని పలు ఎన్జీవోల గుర్తింపును రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. అయితే ఆ రద్దు చేసిన ఎన్జీవోలో ‘అక్కినేని ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌’కూడా ఉంది. అక్కినేని కుటుంబం ఎంతో గర్వంగా తమ సంస్థ చేస్తున్న మంచి పనుల గురించి చెబుతూ ఉంటుంది. అలాంటిది ఇలా గుర్తింపు రద్దు అవుతుందని అసలు ఊహించలేదు.

దేశవ్యాప్తంగా మొత్తం 5,922 కంపెనీలు ఉండగా వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 640 కంపెనీలు ఉండటం గమనార్హం. వాటిలో తెలంగాణకు చెందినవి 190 కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 450 సంస్థలు మంత్రి ప్రకటించిన వాటిలో ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ ఈ పౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రధానం, వైద్య శిబిరాలు,విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్.. వాటిలో కొన్ని..!

అయితే విదేశీ సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించని అక్కినేని ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌ను తాత్కాలికంగా గుర్తింపు రద్దు చేశారు. 2004లో ఈ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. కేంద్రం ఇచ్చిన నోటీసులకు స్పందించిన సంస్థలన్నీ వార్షిక ఆదాయ వివరాలు ఇస్తే వారికి మళ్లీ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here