ప్యాడ్ మ్యాన్ ను నిషేధించిన పాకిస్థాన్.. ఎందుకో తెలుసా..?

భారత్ కు చెందిన సినిమాలకు పాకిస్థాన్ లో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలను నిషేధిస్తూ ఉంటారు. అందులో తీవ్రవాదులకు సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నా.. లేదా పాకిస్థాన్ కు సంబంధించిన అంశాలు ఉన్నా నిషేధం ఎదుర్కొంటూ ఉంటాయి భారతీయ సినిమాలు. అయితే తాజాగా ప్యాడ్ మ్యాన్ చిత్రం నిషేధించింది పాక్..!

అందులో ఎటువంటి నిషిద్ధ అంశాలు కూడా లేవు.. అది కూడా ఆడవారి కోసం తీసిన సినిమా. అలాంటి సినిమాను ఎందుకు నిషేధించారంటే.. ఆ చిత్రం తమ ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసేలా ఉందట.. ఈ మాటలను ఎవరో కాదు సెన్సార్ బోర్డు సభ్యులే అన్నారు. అసలు ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా పాకిస్థాన్ సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించినట్టు దర్శకుడు ఆర్ బాల్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియాలో నెలసరి సమస్యలతో మరణించిన వారు ఎందరో ఉన్నారని, పాకిస్థాన్ మహిళలకు ఈ చిత్రం అవసరమని బాల్కీ అన్నారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి తీసిన సినిమా సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని పాక్ లో ప్రదర్శనకు అనుమతించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here