`మ‌సీదుల‌ను సినిమా హాళ్లుగా మార్చుతారా? అంతు చూస్తాం!`

అల్‌ఖైదా చాన్నాళ్ల త‌రువాత తెర మీదికి వ‌చ్చింది. త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముస్లిం మ‌తానికి విరుద్ధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని, స‌ర‌ళీక‌ర‌ణ పేరుతో మ‌త నియ‌మాల‌ను పాత‌రేస్తున్నార‌ని పేర్కొంది.

 

ఇలాంటి చ‌ర్య‌ల‌ను తాము సహించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఓ బులెటిన్‌ను విడుద‌ల చేసింది. స‌ర‌ళీక‌ర‌ణ‌, ఆధునికీక‌ర‌ణ పేరుతో సౌదీ అరేబియాను క్రౌన్స్ ప్రిన్స్ బిన్ స‌ల్మాన్ భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని పేర్కొందా బులెటిన్‌లో. సౌదీ అరేబియాలో స‌ల్మాన్ ప‌లు కీల‌క‌, విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ముస్లిం మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ల‌ను జారీ చేయ‌డం, దేశ‌వ్యాప్తంగా సినిమా థియేట‌ర్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం వంటివి ఉన్నాయి.

స‌ల్మాన్ అమ‌లు చేస్తున్న నిర్ణ‌యాల‌న్నీ ముస్లిం మ‌త నియ‌మాల‌కు విరుద్ధ‌మంటూ చెబుతోంది అల్ ఖైదా. యెమెన్‌కు చెందిన సున్నీ జిహాదిస్ట్ గ్రూప్ ఒక‌టి అల్‌ఖైదా పేరుతో ఈ బులెటిన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులెటిన్‌ను సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ విభాగం సేక‌రించింది. ఇది వెలువ‌డిన వెంట‌నే- క్రౌన్ ప్రిన్స్‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here