అది విమానం కాదు ఏలియన్స్ వచ్చారు.. చంద్రగ్రహణం రోజున..!

సూపర్ మూన్, బ్లడ్ మూన్ అంటూ జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించింది. ఆకాశంలో చోటుచేసుకున్న అరుదైన వింతను చూసి అందరూ ఆనందించారు. 152 సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతం చోటుచేసుకుంది. ఇక సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు లక్షల సంఖ్యలో అప్లోడ్ అయ్యాయి.

అయితే ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చంద్రుడి పక్కనుంచి చాలా వేగంతో ఒక వస్తువు వెళ్ళింది. నాసా విడుదల చేసిన వీడియోలో కూడా ఈ వస్తువు కనిపించడంతో ఏలియన్ హంటర్లు అది యూఎఫ్ఓ అని, ఏలియన్స్ ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని వారు చెబుతున్నారు. మనిషి తయారు చేసిన ఏ వాహకం కూడా అంతవేగంతో వెళ్లడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. యూఎఫ్‌ఓ మానియా అనే చానెల్ ఆ వీడియోను పోస్ట్ చేసింది. అయితే అది బోయింగ్ ఎయిర్ క్రాప్ట్ లేదా వెదర్ బెలూన్ అని కొందరు కొట్టి పడేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here