సునీత మీద పరువునష్టం దావా వేస్తానన్న కత్తి మహేష్.. కొణిదెల ప్రొడక్షన్స్ చేయిస్తోందట..!

ప్రస్తుతం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ మీద తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి. అలాగే సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించి కూడా ఆరోపణలు వచ్చాయి. సునీత అనే మహిళ కత్తి మహేష్ మీద లైవ్ లో తీవ్ర ఆరోపణలు చేసింది.

సునీత ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ పక్కన ఉండగానే… ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన తనను బలవంతం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టాలని కత్తి మహేష్ ఓ వైపు టీవీ ఛానల్స్ లో కూర్చొని నీతులు చెబుతున్నాడని.. కానీ కత్తి మహేష్ కూడా అలాంటి వాడేనని ఆరోపణలు వస్తున్నాయి.

దీనిపై కత్తి మహేష్ ట్విట్టర్‌లో స్పందించాడు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సునీతపై పరువు నష్టం దావా చేస్తానంటూ ఓ ట్వీట్ చేశాడు. ఆమె వెనుక కొణిదెల ప్రొడక్షన్స్ ఉందని కూడా ఆరోపించారు. గతంలో ఆమెకు తాను డబ్బులు కూడా వేశానని చెప్పుకొచ్చాడు.. కత్తి మహేష్. ఒకరోజు తనను ఇంట్లోకి పిలిచాడని.. అప్పుడు కత్తి మహేష్ లుంగీతో ఉన్నాడని.. తనను బలవంతం చేయబోయాడని సునీత లైవ్ లోనే చెప్పుకొచ్చింది. అందుకే కత్తి మహేష్ ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here