ఆస్కార్ అవార్డును కొట్టేసిన దొంగ.. ఎలా దొరికిపోయాడంటే..!

ఆస్కార్ అవార్డులను గెలిచిన వారు దాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పడానికి కూడా సాధ్యం కాదు. ఈ ఏడాది ఉత్తమనటిగా ఆస్కార్ అవార్డు గెలిచిన ఫ్రాన్సెస్‌ మెక్‌ డార్మండ్‌ కు ఆ అనుభవం ఎదురైంది. అయితే ఆ కొట్టేసిన వ్యక్తి ఫోటోలకు ఫోజులు ఇచ్చి.. అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

‘త్రీ బిల్‌ బోర్డ్స్‌ ఔట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ’ సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ నటి ఆస్కార్ అవార్డ్ ను ఫ్రాన్సెస్‌ మెక్‌ డార్మండ్‌ గెలుచుకుంది. ఆమె ఆస్కార్ అవార్డ్ ను టెర్రీ బ్రయాంట్‌ (47) దొంగిలించాడు. అవార్డును తానే గెలుచుకున్నంత సంతోషంతో దానిని పట్టుకెళ్తూ, ఫోటోలకు ఫోజులిచ్చాడు.

ఫోజులైతే ఇచ్చాడు కానీ ఓ సాధారణ వ్యక్తి చేతిలోకి అవార్డు ఎలా వెళ్ళిందన్న అనుమానం అందరికీ వచ్చింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డు పోయిందన్న వార్త కూడా బయటకు రావడంతో టెర్రీ బ్రయాంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో ఆమెకు అవార్డు తిరిగి ఇచ్చేశారు. అవార్డు గెలుచుకున్నానన్న ఆనందంలో పార్టీ చేసుకుంటూ ఉండగా.. టెర్రీ అవార్డును లేపేశాడు. యాక్టింగ్ చేసి అవార్డు సంపాదించం కష్టం అనుకున్నాడేమో కానీ.. కొట్టేయడం మాత్రం చాలా ఈజీనే అని నిరూపించాడు..! గతంలో పలు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి టెర్రీ హాజరు కూడా అయ్యాడు. పలువురు ప్రముఖులతో అతడికి సత్సంబంధాలు ఉన్నాయి.. అలాంటి వ్యక్తి ఎందుకు దొంగతనం చేశాడా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Jimmie Kimmel and Terry

A post shared by Dj Matari (@djmatari) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here