ప్రియా వారియర్ లా నటించిన అల్లు అర్జున్.. వీడియో మీరూ చూడండి..!

ప్రియా వారియర్.. ఒకే ఒక్క చిన్న వీడియోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆమెను పలువురు సెలెబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. ఆమెను చాలా మంది అనుకరించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పుడు ఆ లిస్టులోకి అల్లు అర్జున్ కూడా వచ్చి చేరారు. ‘ఒరు అడార్ లవ్’ సినిమా నుండి మొదట వచ్చిన కన్ను ఎగరేసే సీన్ కాకుండా.. రెండో సారి వచ్చిన ప్రియా వారియర్ తుపాకీ సీన్ ను అల్లు అర్జున్ చేసి చూపించాడు. అయితే అల్లు అర్జున్ ఈ సీన్ చేసి చూపించింది ఎవరితోనో కాదు తన కొడుకుతో..!

తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ పేరడీని చేశాడు. తన చూపుడు వేలు మధ్య వేలుకు ముద్దుపెట్టిన బన్ని, తన కుమారుడికి దాన్ని గురిపెట్టి షూట్ చేశాడు. బ‌న్ని అలా షూట్ చేయ‌డంతో అయాన్ బెడ్‌పై పడిపోయాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు.

#oruadaarlove

A post shared by Sneha (@allusnehareddy) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here