అల్లు అర్జున్ ఆ యువకుడిని బ్రతికించడానికి 10 లక్షలు సహాయం చేశాడు.. కానీ చివరికి..!

తన అభిమానిని బ్రతికించుకోవడానికి అల్లు అర్జున్ చేసిన సహాయం వృధా అయింది. బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్ దేవ్ సాయి గణేష్ చనిపోయాడు. కొద్ది రోజుల క్రితమే అల్లు అర్జున్ అనకాపల్లికి వెళ్ళి మరీ కలిసి వచ్చాడు. అతడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చాడు.

కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ అభిమాని అయిన దేవ్ సాయి గణేష్ ను అనకాపల్లిలో కలిశాడు. అతడు బోన్ కాన్సర్ తో బాధపడుతున్నాడని.. తనను చూడాలన్న చివరి కోరికను టీం ద్వారా తెలుసుకున్న బన్నీ స్వయంగా అక్కడికి వెళ్లి పరామర్శించిన వచ్చాడు. గణేష్ తో మాట్లాడి ఓదార్చి త్వరగా కోలుకునేలా మంచి మాటలు చెప్పి కాసేపు ఫోటోలు కూడా దిగాడు. అల్లు అర్జున్ తో సహా అంతా ఆ అభిమాని కోలుకుంటాడు అనే అనుకున్నారు. అయితే దేవ్ సాయి గణేష్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్లు విశ్వప్రయత్నం చేసినప్పటికీ గణేష్ శరీరం సహకరించలేదని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని సన్నిహితుల సమాచారం.

అభిమాని మృతి పట్ల అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితమే తాను పరామర్శించి వచ్చిన అభిమాని ఇకలేడనే వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలి. అతను ఇకలేడనే వార్తను నేను విన్నప్పుడు గుండె పగిలిపోయింది. కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ బన్నీ పేర్కొన్నారు.

https://www.instagram.com/p/BitvgomBm2o/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here