అమలాపాల్ ధైర్యం చేసింది.. అందరికీ నచ్చింది..!

సినీ నటి అమలా పాల్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మొదట కారు విషయంలో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. తప్పుడు పత్రాలతో కారు కొందని అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోవడం.. బెయిల్ రావడం అన్నీ జరిగిపోయాయి. ఇంతలో ఆమె జీవితంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఆమెకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. చెన్నైకి చెందిన అల‌గేశన్ అనే వ్యాపార‌వేత్త త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు అమ‌లాపాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన మాంబళం ఇన్‌ స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ లు నిందితుడ్ని అరెస్టు చేసినందుకు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపింది.

అమలాపాల్ ధైర్యానికి నడిగర్ సంఘం అభినందించింది. ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై నడిగర్ సంఘం ఆమె ధైర్యానికి మెచ్చుకుంది. దీనిపై ప్రకటన విడుదల చేసిన నడిగర్ సంఘం లైంగిక వేధింపులపై పలువురు నటీమణులు బయటకు మాట్లాడేందుకు వెనకాడుతున్న తరుణంలో తనకు జరిగిన వేధింపులపై అమలాపాల్‌ ధైర్యంగా ముందుకురావడం అభినందనీయమని తెలిపింది. మ‌లేసియాలో స్థిర‌ప‌డిన త‌మిళుల సంక్షేమం కోసం `డాజిలింగ్ త‌మిళ‌చ్చి` పేరుతో త్వ‌ర‌లో ఆమె ఆ దేశంలో ఓ మ్యూజిక‌ల్ నైట్‌లో పాల్గొన‌బోతున్నారు. దీనికోసం మూడురోజుల కింద‌ట ఆమె చెన్నై టీన‌గ‌ర్ మ‌న్నార్ శాలైలోని ఓ డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు. అదే ఇన్‌స్టిట్యూట్‌కు అల‌గేశ‌న్ కూడా వ‌చ్చేవాడ‌ని, త‌న‌తో మాట‌లు క‌లిపి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసుల‌కు చెప్పారు. త‌న కోరిక ఎంత డ‌బ్బ‌యినా ఇస్తానంటూ ఫోన్ ద్వారా కూడా వేధించాడ‌ని అమలా పాల్ తన ఫిర్యాదులో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here