కాషాయ రంగు బట్టల్లో దర్శనమిచ్చిన అంబేద్కర్.. రంగు ఎందుకు మార్చారంటే..!

మనం ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహం నీలం రంగులో ఉంటుంది.. కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకులు మాత్రం అంబేద్కర్ ను కాషాయంలో ప్రతిష్టించారు. ఇటీవల బదాన్ ప్రాంతంలోని దుగ్రాయా గ్రామంలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి అధికారులు తిరిగి ప్రతిష్ఠించారు. అంబేద్కర్ ధరించే సూట్ కు సాధారణంగా ఉండే నలుపు లేదా నీలిరంగు స్థానంలో కాషాయపు రంగు వేయడంతో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ప్యాంట్, కోట్ బదులుగా, తెల్లని లాల్చీ, కాషాయపు రంగు జుబ్బా ధరించినట్టుగా అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించాయి.

అయితే బీఎస్పీ లీడర్ హిమేంద్ర గౌతమ్ మాత్రం చూస్తూ ఊరుకోలేదు. ఈరోజు ఒక పెయింటర్ ను వెంటబట్టుకొని వచ్చిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి నీలం రంగు పెయింట్ కొట్టించారు. కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేయడంతో ఎన్నో గొడవలు జరిగాయి.. దీంతో మళ్ళీ ప్రభుత్వ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు. కానీ ఇక్కడే ‘కాషాయ’ రంగులో తమ మార్కును చూపించారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం ఒప్పుకోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here