మోడల్ అర్పితా తివారీని చంపింది ఇతడే.. బయటపడ్డ చాలా విషయాలు..!

మోడల్ అర్పితా తివారీని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను చంపడానికి గల కారణాలను అతడు బయటపెట్టాడు. ఎంతో అందంగా ఉండే.. అందరితోనూ కలిసిపోయే అర్పిత తివారీ అంటే తనకు చాలా ఇష్టమని నిందితుడు అమిత్ హజ్రా చెప్పాడు. తనకు అర్పితతో డేటింగ్ చేయాలని ఉండేదని.. ఆ విషయాన్నే అర్పితకు చెబితే ఆమె అసలు పట్టించుకోలేదని.. ఆమె ఒప్పుకోకపోవడంతోనే ఆమెను హత్య చేశానని అమిత్ హజ్రా ముంబై లోని మల్వానీ పోలీసులకు చెప్పాడు.

అలాగే అర్పిత బాయ్ ఫ్రెండ్ ను కూడా పిలిపించి పోలీసులు విచారించారు. అర్పిత పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలను పోలీసుల ముందు బయటపెట్టాడు అతడు. అతడు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. సోమవారం నాడు అమిత్ హజ్రాను అరెస్ట్ చేసి.. పాలీగ్రాఫ్ టెస్ట్ ను కూడా నిర్వహించారు.

గత ఏడాది డిసెంబర్ 11న మోడల్ అర్పిత తివారి 15అంతస్థుల పైన నుండి కిందపడి చనిపోయింది. మలాద్ లోని ఎలైట్ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్పిత కుటుంబ సభ్యులు ఆమె బాయ్ ఫ్రెండ్ తో సహా అయిదుగురిపై అభియోగాలు మోపారు. వారిలో అమిత్ హజ్రా నిందితుడిగా తేలాడు. డిసెంబర్ 10వ తేదీ రాత్రి అమిత్ కూ.. అర్పితకూ మధ్య గొడవ జరిగిందని.. అందుకే డిసెంబర్ 11న అతడు బాత్ రూమ్ కిటికీ నుండి ఆమెను తోసి చంపేశాడని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here