మూడు, నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లను కిందకు తెస్తారట..!

ప్రస్తుతం వాహనదారులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అలా ఉన్నాయి మరి..! దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ ను పరిగణలోకి తీసుకొని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. అలాగే అధికారపక్షాన్ని ప్రతిపక్షం ఎండగడుతోంది. విమర్శలు అధికమవుతున్న వేళ బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. తమకు నాలుగంటే నాలుగు రోజులు సమయం ఇవ్వాలని కోరారు.

మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోడీ గట్టెక్కిస్తారని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు మోడీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడునాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.76.87కు చేరుకోగా, ముంబైలో రూ.84.70కి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here