చిన్న‌ప్పుడే మ‌ణిర‌త్నం మూవీలో న‌టించింది..ఇప్పుడు పెళ్లి కుదిరింది! వ‌రుడెవ‌రో కాదు!

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తీసిని సినిమాల్లో హృద‌యానికి హ‌త్తుకునేది..గుర్తుండి పోయే మూవీ `అమృత‌`. అందులో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి పాత్ర‌ను పోషించిన న‌టి కీర్త‌న‌. తెలుగు, త‌మిళ న‌టి సీత, న‌టుడు పార్తీబ‌న్ కుమార్తె.

అమృత త‌రువాత పెద్ద‌గా వెండితెర‌పై క‌నిపించ‌ని కీర్త‌న తాజాగా వార్త‌ల్లోకెక్కారు. అమృత మూవీలో టైటిల్ పాత్రో, శ్రీలంకలో స్థిర‌ప‌డిన‌ తమిళ అమ్మాయిగా కనిపించిన కీర్తనకు పెళ్లి కుదిరింది. వ‌చ్చేనెల 8న వివాహం.

చెన్నై లీలా ప్యాలెస్ హోట‌ల్‌లో పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. పార్తీబ‌న్‌, సీత కొన్నాళ్ల కింద‌టే విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. కుమార్తె పెళ్లి కోసం ఒక్క‌ట‌య్యారు.

ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా వేరెవ‌రినో కాదు. వ‌రుడు సీనియ‌ర్ ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ కుమారుడే. అత‌ని పేరు అక్ష‌య్‌. తండ్రితో పాటు ఎడిటింగ్, డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లోనే కొన‌సాగుతున్నాడు అక్ష‌య్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here