అచ్చం త‌నలాగే ఉన్న యువ‌కుడిని క‌లుసుకోవ‌డానికి దేశం దాటొచ్చాడు..!

కైరో: ఈ ఫొటోలో ఉన్న ఇద్ద‌రు యువ‌కులు చూడ్డానికి హ‌లో బ్ర‌ద‌ర్‌లా క‌నిపిస్తున్నారు క‌దూ! కానీ కాదు. వాళ్లిద్ద‌రికీ ఎలాంటి రిలేష‌నూ లేదు. ఆ మాట‌కొస్తే.. వారిద్ద‌రిదీ ఒకే దేశం కూడా కాదు. అందులో ఒక‌రు ఈజిప్ట్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ మో స‌లా. ఈజిప్ట్ జాతీయ ఫుట్‌బాల్ జ‌ట్టు ప్లేయ‌ర్‌. మ‌రొక‌రు సౌదీ దేశ‌స్థుడు.

 

ఫుట్‌బాల్ అంటే ప‌డిచ‌స్తాడు. ఈజిప్ట్ త‌ర‌ఫున ఆడే మో స‌లాను చూశాడు. అచ్చం త‌న‌లాగే ఉండ‌టంతో అత‌ణ్ణి ఒక్క‌సారైనా క‌లుసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. రెండురోజుల కింద‌ట ఈజిప్ట్ వెళ్లాడు. రాజ‌ధాని కైరోలో మో స‌లా ఇంటికి వెళ్లాడు. త‌న‌లాగే ఉన్న సౌదీ కుర్రాడ్ని చూసి.. స‌లా కూడా ఆశ్చ‌ర్య‌పోయాడు.

ఆ యువ‌కుడితో చాలాసేపు ముచ్చ‌టించాడు సెల్ఫీ దిగాడు. ఆతిథ్యం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను స‌లా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో ఎవ‌రు ఎవ‌రో తేల్చుకోలేక‌పోతున్నామంటూ స‌లా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక‌రిని పోలిన వారు మ‌రొక‌రిగా ఏడుమంది ఉంటారంటే నిజ‌మేనేమో క‌దా!

Mo Salah Doppelganger

#SceneSpotted: Mohamed Salah has a doppelganger and it's UNREAL!Video by Al Masry Al Youm.

Cairo Sceneさんの投稿 2018年5月3日(木)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here