అరె! ఎస్కలేట‌ర్ ఇలాక్కూడా ఎక్కొచ్చా?

ఎస్క‌లేట‌ర్ ఎక్క‌డం స‌ర‌దాగా ఉంటుంది. ఎంచ‌క్కా కాలు క‌ద‌ప‌కుండా మేడ మీదికెళ్లొచ్చు. కాలు క‌ద‌ప‌కుండానే కిందికీ దిగేసేయొచ్చు. ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేష‌న్లు, మ‌ల్టీ ప్లెక్స్‌, షాపింగ్‌మాల్స్‌ల‌ల్లో ఎస్క‌లేట‌ర్లు స‌ర్వ‌సాధార‌ణం.

ఈ ఎస్క‌లేట‌ర్‌ను ఓ యువ‌కుడు వెరైటీగా ఎక్కాడు. ఇలాక్కూడా ఎక్కొచ్చ‌ని చేసి చూపించాడు. ఆ యువ‌కుడు ఓ అథ్లెట్. ద‌క్షిణ కొరియాలోని ప్యెంగ్‌ఛాంగ్ కంట్రీలో ఏర్పాటైన వింట‌ర్ ఒలింపిక్స్‌లో పాల్గొన‌డానికొచ్చాడు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఎయిర్‌పోర్ట్‌లో ఇలా వెరైటీగా ఎస్క‌లేట‌ర్ ఎక్కాడు. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఎస్క‌లేట‌ర్ ప‌క్కకొచ్చి, కుడిచేత్తో దాని సైడ్‌బార్ గ‌ట్టిగా ప‌ట్టుకుని, దానితో పాటే పైకెళ్లిపోయాడు.

ఎడ్జ్‌లోకి వెళ్లిన త‌రువాత అదే చేత్తో రెయిలింగ్‌ను ప‌ట్టుకుని అటు వైపు జంప్ చేసి, వెన‌క్కి తిరిగి చూడ‌కుండా వెళ్లాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here