సెటైర్ల మీద.. సెటైర్లు వేసే.. ఆనం వివేకానందరెడ్డి.. ఇప్పుడిలా..!

నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు ఆనం వివేకానందరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అటువంటి ఆనం వివేకానంద రెడ్డి పరిస్థితి క్రిటికల్ గా ఉందట. ఆసుపత్రి బెడ్ మీద చికిత్స పొందుతున్న ఫోటోలు ఇప్పుడు ఆయన అభిమానులను కలవరపెడుతున్నాయి.

సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడి బయటకు వచ్చిన కొద్దిమందిలో వివేక ఒకరు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టీడీపీలో చేరారు. హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్ కు వచ్చి ఆయనను పరామర్శించారు. నీరసంతో.. బాగా చిక్కిపోయి కనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here