ప్రతి రోజూ ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారు.. ఇలానే బతకాల్సిందేనా.. అన్న అనసూయ..!

ఒకప్పటితో పోల్చుకుంటే.. మహిళలు ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లోనూ రాణిస్తూ ఉన్నారు.. అలాగే ఎక్కువ మంది ప్రవేశిస్తున్నారు కూడా..! వారిని బాగా చూసుకోవాల్సింది పోయి మోకాలడ్డే వాళ్ళే ఎక్కువ అయిపోతున్నారు. మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్న వెధవలు.. వికృత చేష్టలతో బయటకు వచ్చిన ఆడవారిని కూడా భయపెడుతున్నారు. ఇక సినిమా, టీవీ రంగంలో ఉన్న మహిళను సోషల్ మీడియాలోనే ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆడవారు అన్న కనీస జ్ఞానం కూడా ఉండదు. ఎన్నాళ్ళైనా అలాంటి వారిలో మార్పు రాదు.
యాంకర్ అనసూయకు కూడా అలాంటి కామెంట్లు చాలా వచ్చాయి. ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలదొక్కుకుంది. జనవరి 26న తనకు ఎదురవుతున్న సమస్యలను.. బయటవారు ఎలా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో పంచుకుంది. ఇలానే బ్రతకాల్సిందేనా అంటూ చాలా బాధను వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ ను పెట్టింది.

డియర్ ఇండియా..ఓ కూతురిగా సోదరిగా మహిళగా భార్యగా కోడలిగా తల్లిగా నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం కోసం అన్ని విధాలుగా కష్టపడుతున్నా. నేను చేసే ప్రతి పని – వేసుకునే దుస్తులు నా ఫ్యామిలీపై ఏ ప్రభావం చూపడం లేదు. కానీ వేరేవాళ్లు వీటి గురించి మాత్రం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నా ఫ్యామిలీని నన్ను కించపరిచే రైట్ వారికి ఎక్కడిది? ప్రతి రోజూ ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారు.

https://twitter.com/anusuyakhasba/status/956801872269996032

ఇక సోషల్ మీడియాలో కూడా అలాంటి కామెంట్లు చేస్తున్నారు. నేను ఈ గణతంత్ర దినోత్సవం నాడు బాధ్యతగల మహిళగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నచ్చిన పనిని నేను స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను. ఆకతాయిలు సంప్రదాయం – సంస్కృతి అంటూ నా ఇష్టాల గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను అంటుంటే నేను ఎలా జీవించాను. ఇలానే బతకాల్సిందేనా? ఈ తరహా ధోరణిని ఏమీ చేయలేమా? అంటూ.. అనసూయ స్వేచ్ఛ అంటే ఇదేనా?’ అని పోస్ట్ చేసింది.

ఆమె అడిగిన దానిలో ఏ మాత్రం తప్పు లేదు.. వారికి ఇవ్వాల్సింది మనం గౌరవం మాత్రమే.. మరేదీ లేదు.. ఇకనైనా మారుతారన్న కారణంతోనే అనసూయ ఆ పోస్ట్ పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here