సక్సెస్ మీట్ లో అనసూయ మాటలు విన్నారా..?

రంగస్థలం సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.. అందులో స్టార్లు మన వాళ్లకు కనిపించలేదు.. కేవలం పాత్రలు మాత్రమే కనిపించాయి. చిట్టిబాబు కానీ.. ప్రెసిడెంట్ కానీ.. రంగమ్మత్త కానీ.. ప్రతి ఒక్కరూ మనకు అలా గుర్తుండిపోతారు. ఈ చిత్ర బృందం ఈరోజు థాంక్స్ మీట్ లో పాల్గొంది. ఆ కార్యక్రమంలో రంగమ్మత్తగా చేసిన అనసూయ మాట్లాడిన మాటలు వింటే అనసూయలో ఇంత మార్పు వచ్చిందా అని అనిపిస్తుంది.

కొద్ది రోజుల క్రితం ఓ చిన్న పిల్లవాడి ఫోన్ పగులగొట్టిన అనసూయ ఆ తర్వాత సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు ఆ విషయాల గురించే అనసూయ ప్రస్తావించింది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అత్తా అని పిలిపించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. తనతో కూడా ‘ప్రేమంటే అంతేరా అల్లుడూ’ అనడంతో పాటు రామ్ చరణ్ ను రెండు సార్లు అల్లుడు అని పిలిపించారని గుర్తు చేసుకుంది అనసూయ. తనను ఆకాశంలోకి ఓసారి ఎత్తేయడం.. ఆ తర్వాత ఫట్ మని పడేయడం వంటివి అన్నీ మీడియా మిత్రులే చేశారని.. మళ్లీ ఇప్పుడు రంగమ్మత్తను తెగ పొగుడుతున్నారని చెప్పింది. మీడియా తన గురించి పాజిటివ్ గా ఉండాలంటే తాను ఎలా ఉండాలో తెలియచేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here