అంతకు ముందు రోజే మద్యం తాగి నడపొద్దు అని స్పీచ్ ఇచ్చాడు.. కానీ ప్రదీప్ ఇలా..!

యాంకర్ గా ఎంతో మంచిపేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. ఒక్కే ఒక్క రోజు రాత్రి తన పరువును పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులో పలువురు దొరికిపోయారు. వారిపై కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. ఆదివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్కరోజే హైదరాబాదులో 55,540 వాహనాలను తనిఖీ చేశారు. 1683 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వారిలో ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ పేరు బయటకు వచ్చింది.

అంతకు ముందు రోజే యాంకర్ ప్రదీప్ మద్యం తాగి డ్రైవ్ చేస్తే వచ్చే అనర్థాలపై స్పీచ్ ఇచ్చాడట. కానీ ప్రసంగించిన తర్వాతి రోజే అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ టేస్టులో ప్రదీప్‌ది 178 పాయింట్ల రీడింగ్ నమోదయింది. ప్రదీప్ మోతాదుకు మించి మూడింతలు మద్యం తాగారు. పోలీసులకు దొరకడంతో ప్రదీప్ తన కారును పోలీసులకు అప్పగించి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతనిని పోలీసులు కోర్టు ముందు హాజరు హాజరుపరచనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here