యాంకర్ ప్రదీప్ కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ను పంపిన హైదరాబాద్ పోలీసులు..!

యాంకర్ ప్రదీప్ జనవరి 1వ తేదీ సందర్భంగా మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడికి పోలీసులు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పిలిచారు. రెండు రోజులుగా ప్రదీప్ అసలు హాజరు కాలేదు. ఈ విషయాన్ని కూడా ఎఫ్.ఐ.ఆర్. లో చేరుస్తామని పోలీసులు తెలిపారు.

ప్రదీప్ ను బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగే కౌన్సెలింగ్ కు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించినా, ఇప్పటి వరకూ హాజరు కాలేదని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ బలవంతయ్య వెల్లడించారు. కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు సమయం ఉన్నప్పటికీ, దొరికిపోయిన రెండు రోజుల్లోపే కౌన్సెలింగ్ ను పూర్తి చేస్తున్నామని, ప్రదీప్ కోసం ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సైతం పంపించామని ఆయన చెప్పారు. నేడు కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే, ఈ విషయాన్ని కూడా చార్జ్ షీట్ రిపోర్టులో చేరుస్తామని అన్నారు.

జనవరి 1వ తేదీ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్‌ కారును ఆపారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా.. బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ (బీఏసీ) 178గా నమోదైంది. బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here