మందు తాగి వాహనాన్ని నడిపితే ఏమవుతుందో చెప్పిన యాంకర్ ప్రదీప్ వీడియో వైరల్..!

డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం తాగుతూ దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఇంకో కొన్ని గంటల్లో కోర్టు ఎదుట హాజరుకానున్నాడు. అతడి మీద సోషల్ మీడియా లోనూ.. వార్తా ఛానల్స్ లోనూ పలు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే గతంలో ప్రదీప్ మద్యం తాగి వాహనాలు నడిపితే వచ్చే అనర్థాలపై ఓ ఫుటేజీ ఇచ్చాడు. ఆ ఫుటేజీ ఇప్పుడు అందరూ చూస్తున్నారు. మద్యం తాగి నడిపితే ఎంతో మంది ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయని ఆ వీడియోలో ప్రదీప్ చెప్పాడు.

అప్పట్లో నీతి వాక్యాలు చెప్పిన వాడే.. ఇవాళ త‌ప్పతాగి దొరికిపోయాడంటూ వార్తా ఛాన‌ళ్లు ప్ర‌దీప్‌ టాపిక్ ను తెగ ప్లే చేస్తున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ కు నేడు హాజరుకావాల్సిందిగా ప్రదీప్ ను ఆదేశించారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చి తన ‘టీఎస్ 07 ఈయూ 6666’ కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరాడు. జూబ్లీహిల్స్ లో తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు. తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉందట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here