ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అద్దిరిపోయిన యాంక‌ర్ ట్వీట్‌!

హైద‌రాబాద్‌: కాస్టింగ్ కౌచ్‌, శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారాల‌ను అడ్డుగా పెట్టుకుని ప‌చ్చ ఛానెళ్లు త‌న‌పై బుర‌ద జ‌ల్లుతున్నాయ‌ని ఆరోపిస్తూ ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తోన్న పోరాటానికి టాలీవుడ్ అండ‌గా నిలిచింది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అండ‌గా నిల్చున్నారు.

అదే స‌మ‌యంలో ప‌లువురు బుల్లితెర న‌టులు, యాంక‌ర్లు ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఇందులో భాగంగా.. యాంక‌ర్ శ్యామ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తుగా శుక్ర‌వారం చేసిన ఓ ట్వీట్ అద్దిరిపోయింది.

మా కార్యాల‌యంలో దీక్ష‌కు దిగిన ప‌వ‌న్‌ను ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేశారు. ‘శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు..! పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు..! యుద్ధం చేస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణుడే.. జాగ్రత్త’ అంటూ శ్యామల ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here