అక్కడ దొరికింది ఏంటో తెలుసుకోడానికి అధికారులు పరుగులు పెట్టారు..!

ఇంటి కోసం తండ్రీ కొడుకులు త్రవ్వుతూ వెళ్ళారు. అయితే ఆ త్రవ్వకాలలో ఏకంగా వంద ఏళ్లకు పైబడిన నాణేలు లభించాయి. వాటిని చూడడానికి పురాతత్వ శాఖ అధికారులు కూడా వస్తున్నారు.

ఈ నాణేలు లక్నో సమీపంలోని హర్దోయ్ జిల్లా సరేహరీ గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడ తండ్రీకొడుకులు తమ ఇంటికోసం త్రవ్వకాలు మొదలుపెట్టగా.. గోడ పక్కన ఉన్న కాస్త స్థలం కూలిపోయింది. అందులో వారికి బంగారు నాణేలు, వెండి నాణేలు బయటపడ్డాయి. వెంటనే ఈ విషయం గ్రామమంతా తెలిసిపోయింది.

చివరికి పోలీసులకు కూడా తెలియడంతో వారు అక్కడికి వచ్చి ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కనుక్కోడానికి పురాతత్వశాఖ సహాయం కోరారు. వాటి విలువ చాలానే ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తం 37 నాణేలు దొరికాయట. అప్పటి రాజుల ఫోటోలు కూడా వాటి మీద ముద్రించడం గమనించవచ్చు. ఆ ఇంటి యజమాని మున్శీలాల్ తమ ఇంట్లో ఎన్నేళ్ళ క్రితం నుండి అవి అక్కడ ఉన్నాయో తెలీదని.. ఇంటిని రిపేరు చేస్తుంటే బయటపడ్డాయని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here