23 ఏళ్ల అమ్మాయి.. 31ఏళ్ల బాయ్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ లో గది కావాలనుకుంది..!

భారతదేశానికి చెందిన యువతి.. తన సౌత్ అమెరికన్ బాయ్ ఫ్రెండ్ తో భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చింది. అయితే వారిద్దరూ రూమ్ తీసుకోవాలని అనుకోగా.. అది కాస్తా బెడిసికొట్టింది. పెళ్ళి చేసుకోని జంటకు కలిపి ఒకే గది ఇచ్చేది లేదని చెప్పింది ముంబై లోని ఓ హోటల్..! దీంతో ఆ యువతి ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది.


ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువతికి యూకేలో పీజీ చదువుతున్న 31 ఏళ్ల అమెరికన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇండియా చూసేందుకు ప్రియుడు వచ్చాడు. అప్పటికే వారు దేశం లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముంబైకి వచ్చే ముందే అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని ఫ్యాబ్ హోటల్ లో ఈ జంట ఓ రూమ్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంది. తీరా హోటల్ వద్దకు వచ్చి చెకిన్ అవుదామనుకున్న సమయంలో, పెళ్లి కాని జంటలకు తాము రూము ఇచ్చేది లేదని హోటల్ మేనేజ్ మెంట్ తెగేసి చెప్పింది. ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించామని, ఎక్కడా ఈ సమస్య ఎదురు కాలేదని ఆ జంట వాపోయినా ఫలితం లేకపోయింది.

తన బాయ్ ఫ్రెండ్ భారత్ కు రావడం మొదటిసారని.. చాలా ప్రాంతాల్లో లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చిందని ఆమె హోటల్ మేనేజ్మెంట్ ను ప్రశ్నించింది. తాము తమ ఐడీ కార్డులు ఇచ్చినా కూడా వారు ఇలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఇక చేసేది లేక ఆ యువతి అదే హోటల్ లో ఇంకో గది తీసుకుంది. రీఫండ్ ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here