కాకినాడ నుండి కాశీ వెళ్ళి చావు కోసం ఎదురుచూస్తున్నారు ఏడేళ్ళుగా.. నలుగురు కొడుకులూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే..!

కాకినాడకు చెందిన ఈ దంపతులు సొంత ఊరిని వదిలి కాశీకి వెళ్ళారు. వీరిద్దరికీ నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ కూడా వారు అక్కడే ఉంటున్నారు. కాశీలో చనిపోతే పుణ్యం అయినా వస్తుందని వారు ఏడు సంవత్సరాలుగా చావు కోసం ఎదురుచూస్తున్నారు.

యూపీ లోని వారణాసిలో ఓ వృద్ధ జంట ఉంది. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వారణాసి లోని ముముక్ష్ భవన్ లో ఓ చిన్న గదిలో వారు ఉంటున్నారు. ప్రతి రోజూ శివుడికి పూజలు చేస్తూ ఎప్పుడు చనిపోతామా అని ఎదురుచూస్తున్నారు. కాశీలో చనిపోతే పుణ్యం వస్తుందన్న కారణంతోనే తాము ఇక్కడ బ్రతుకుతున్నట్లు తెలిపారు. తమ నలుగురు కొడుకులూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లేనని వాళ్ళు అప్పుడప్పుడూ తమ వద్దకు వచ్చి వెళుతుంటారని ఆ దంపతులు తెలిపారు. 2011 లో వారు కాశీ చేరుకున్నారు.

కాకినాడకు చెందిన సంస్కృత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ అవతార్ శర్మ తన భార్య వెంకటరమణమ్మతో కలసి యూపీ లోని వారణాసిలో ఉంటున్నాడు, తాము గత నాలుగు సంవత్సరాలుగా కాశీలో ఉంటున్నామని తెలిపారు. మూడు సంవత్సరాల నుండి ఇదే ఇంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పారు. ఆయన భార్య వెంకటరమణమ్మ ఇంటర్ కాలేజీలో తెలుగు టీచర్ గా పనిచేసిందట. తమ బిడ్డలు ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. తమ జీవితం పిల్లలను పెద్దవారిని చేసి.. వారిని ఓ స్థాయికి తీసుకొని వెళ్ళడంతో ముగిసిందని.. ఇక చావు కోసమే ఎదురుచూస్తున్నామని తెలిపారు. తాము చిన్నప్పటి నుండీ కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుందని నమ్మేవాళ్ళమని అందుకే ఇక్కడకు వచ్చామని చెప్పుకొచ్చారు. అదీ కూడా తాము ఇష్టపూర్వకంగానే ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు.

అలాగే అవతార్ శర్మ 11 అడుగుల పంచముఖీ శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దర్శించుకుంటే 3కోట్ల 25లక్షల సార్లు ‘ఓం నమః శివాయ’ అని జపించినట్లట.. అలాగే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న పుణ్యం దక్కుతుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here