రేపు ఆంధ్రప్రదేశ్ బంద్.. వైఎస్ జగన్ పాదయాత్ర కూడా లేదు..!

రేపు అనగా ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ జరగనుంది. కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిస్తూ పలు పార్టీ నాయకులు రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా మద్దతు పలికారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్ర బంద్ కు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి మద్దతు ప్రకటించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

రేపు నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన‌ రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాల‌ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులోని అంశాలన్నీ అమలు చేయాలని, రాష్ట్రంలోని ఎంపీలందరూ రాజీనామా చేయాలని ఆయ‌న అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మించిన ‘మోదీ- బాబు’ జోడీ.. వారిని గెలిపించిన వారికి నిరాశే మిగిల్చిందన్నారు. ప్రతీ వారం శుక్రవారం మాత్రమే పాదయాత్రకు బ్రేక్ ఇచ్చే జగన్.. బంద్ కారణంగా గురువారం నాడు పాదయాత్ర ఆపనున్నాడు. ఈ బంద్ లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here