ఉద‌యం క‌ళ్లెదుటే తండ్రి, భ‌ర్త గొడ‌వ‌: రాత్రి మృత‌దేహంగా!

త‌న క‌ళ్లెదుటే తండ్రి, భ‌ర్త గొడ‌వ ప‌డ్డారు. రాత్ర‌య్యేస‌రికి ఆ మ‌హిళ మృత‌దేహంగా క‌నిపించారు. ఇంట్లో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

 

ఈ ఘ‌ట‌న గుంటూరులో చోటు చేసుకుంది. మృతురాలి పేరు గీతాంజ‌లి. జిల్లాలోని ప‌ల‌క‌లూరు గ్రామానికి చెందిన గీతాంజ‌లికి గుంటూరు న‌గ‌రంలోని కొత్త‌పేటలో నివ‌సించే ర‌వితో గ‌త ఏడాది ఆగ‌స్టులో వివాహ‌మైంది.

ర‌వి స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ల్యాబ్ టెక్నీషియ‌న్‌గా ప‌నిచేస్తున్నాడు. పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచీ ర‌వి దంప‌తుల మధ్య స‌త్సంబంధాలు లేవ‌ని చెబుతున్నారు.

అడిగినంత క‌ట్నం ఇవ్వ‌లేదంటూ ర‌వి త‌ల్లి త‌ర‌చూ ఆమెను వేధింపుల‌కు గురి చేస్తుండేవారు. దీనికితోడు- ర‌వి కూడా త‌న‌కు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ చెబుతుండేవాడు.

కొద్దిరోజుల కింద‌ట అనారోగ్యంతో గీతాంజ‌లి పుట్టింటికి వెళ్లారు. నెల రోజుల పాటు అక్క‌డే ఉన్నారు. ఇటీవ‌లే ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని అత్తింటికి వెళ్లారు.

మ‌రోసారి ర‌వి త‌న భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. దీనితో ఉద‌యం గీతాంజ‌లి త‌న తండ్రిని అత్తింటికి పిలిచారు. భ‌ర్త‌తో మాట్లాడి, కాపురాన్ని నిల‌బెట్టాల‌ని కోరారు.

దీనితో ఆమె తండ్రి ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుమార్తె ఇంటికి వెళ్లాడు. అల్లుడు ర‌వితో మాట్లాడారు. స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నంలో ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ చెల‌రేగింది.

త‌రువాత ఎవ‌రికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో గీతాంజ‌లి ఒంట‌రిగా ఇంట్లో ఉండిపోయారు. రాత్రి ర‌వి విధుల‌ను ముగించుకుని ఇంటికి వ‌చ్చే స‌రికి త‌న గ‌దిలో గీతాంజ‌లి ఉరి వేసుకున్న స్థితిలో క‌నిపించారు.

వెంట‌నే అత‌ను కొత్త‌పేట పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గీతాంజ‌లి త‌ల్లిదండ్రులు అల్లుడిపైనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here