దాచేందుకు ఏమీ లేదని చెప్పిన అనిల్ కపూర్..!

ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో సోనమ్ కపూర్ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆమె పెళ్ళి చేసుకోబోతోందనేది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే పలువురు ప్రముఖులు అనిల్ కపూర్ నివాసానికి వస్తూ ఉండడం జరుగుతోంది. ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజాతో కొన్నేళ్లుగా ఆమె ప్రేమలో ఉంది. చాలా రోజులుగా సోనమ కపూర్ తో కలిసి అతడు చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు. అతడితోనే పెళ్ళి అని చెబుతున్నారు.

ఈ అంశంపై తాజాగా అనిల్ కపూర్ స్పందించాడు. సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. తన కెరీర్ తొలినాళ్ల నుంచి మీడియా తనకు ఎంతో సపోర్ట్ చేసిందని… తమ కుటుంబంలో ఏది జరిగినా మీడియాకు చెప్పేస్తామని.. తన కుమార్తె పెళ్లి విషయంలో దాచేందుకు ఏమీ లేదని చెప్పారు. ముంబైలోని అనిల్ కపూర్ నివాసాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పెళ్లి ఏర్పాట్లలో భాగంగానే, విద్యుత్ దీపాలతో అలంకరించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పెళ్ళి గురించి సోనమ్ మాట్లాడుతూ.. తాను పెద్దగా ఖర్చు చేయనని.. ఇంట్లోనే పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. అందుకే మీడియా మొత్తం ఇంటి చుట్టూ పడిగాపులుకాస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here